
ఆత్మీయ సమ్మేళనం
తాంసి మండలం కప్పర్ల జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2000–01 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 25 ఏళ్ల తర్వాత వీరి ఆత్మీయ సమ్మేళనానికి పాఠశాల వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో సంతోషంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. పాఠశాల హెచ్‌ఎం ఆనంద్, పూర్వ ఉపాధ్యాయులు ఆదినాథ్, శ్రీనివాస్, మనోహర్, విజయతోపాటు రఫీ, అనిల్, సరిత, స్వామి, లక్ష్మణ్ పాల్గొన్నారు. – తాంసి