
విద్యుత్ షాక్‌తో ఎద్దులు మృతి
కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని జంబుగ గ్రామంలో ఆదివారం విద్యుత్‌షాక్‌తో ఎద్దు మృతి చెందింది. గజ్జిగూడకు చెందిన గాజుల మొండయ్యకు చెందిన ఎద్దు మేతకోసం వెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలి అక్కడికక్కడే మృత్యువాతపడింది. దీని విలువ రూ.60 వేలు ఉంటుందని, అధికారులు తనకు పరిహారం ఇప్పించాలని కోరారు. ఈజ్‌గాం ఏఎస్సై హీరామన్, పశువైద్యాధికారులు ఈ సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు ఆరోపించాడు. అందుకే అధికారుల రాలేదని, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని బాధితుడు తెలిపాడు.
భీమిని: మండలంలోని వెంకటపూర్ పంచాయతీ పరిధిలో ఆదివారం విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి చెందింది. గ్రామ శివారులో మేతకు వెళ్లిన ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్ ఎర్త్ వైర్‌కు తగిలి మృతి చెందినట్లు బాధిత రైతు కోట నగేశ్ తెలిపాడు. దీని విలువ రూ.50 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని వేడుకున్నాడు.