
అలరించిన కవి సమ్మేళనం
మంచిర్యాలఅర్బన్: జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్‌లో ఆదివారం సాహితీ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. విశ్రాంత అభియంత సాధు నందమయ్య మాట్లాడుతూ తెలుగు కవి, హాస్యకవి, వికటకవిగా పేరొందిన తెనాలి రామకృష్ణ ఎన్నో అద్భుత కావ్యాలు రచించారన్నారు. భువన విజయంలో ఓ కవి ఇచ్చిన సమస్యకు ఎంతో చక్కని పూర్ణ చమత్కార పద్యాలు ఉదహరించారని తెలిపారు. ఉద్దటారాధ్య చరిత్ర, పాండురంగం మహాత్యం, ఘటికాచల మహాత్యం గురించి వివరించారు. కవులు పెద్ది భరత్, మల్యాల మురళీకృష్ణ, మైసమ్య కవితాగా నం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వామన్‌రావు తదితరులు పాల్గొన్నారు.