
పీజీ పట్టా పొందిన డీఎంహెచ్‌వో
మంచిర్యాలటౌన్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికా రిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ హరీశ్‌రాజ్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(విజయవాడ)లో మైక్రో బయాలజీ(ఎండీ) చేసి పీజీ పట్టా పొందారు. 61 ఏళ్ల వయస్సులో డీఎంహెచ్‌వోగా పనిచేస్తూనే ఈ ఏడాది మేలో పీజీ పరీక్షలు రాయగా, ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు. 1985లో కాకతీయ యూనివర్శిటీలో ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లా మెడికల్ ఆఫీసర్‌గా మొదటిసారి విధుల్లో చేరారు. అనంతరం ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో డిప్యూటీ సివిల్ సర్జన్, డిస్ట్రిక్ట్ ఇమ్యూనైజేషన్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2017లో సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది వరంగల్ డీఎంహెచ్‌వోగా చేరారు. మహబూబాబాద్‌లో పనిచేశారు. ఆగస్టులో ఉద్యోగ విరమణ పొందుతుండగా, అంతకుముందే పీజీ పట్టా పొందడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.