
కబడ్డీ క్రీడాభివృద్ధికి కృషి
శ్రీరాంపూర్: రాష్ట్రంలో కబడ్డీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కాసాని వీరేశ్ తెలి పారు. కబడ్డీ క్రీడాకారులకు మినీ అకాడమీ స్థలాన్ని పరిశీలించడానికి ఆదివారం మంచి ర్యాలకు వచ్చారు. నస్పూర్ కలెక్టరేట్ కమాన్ వద్ద జిల్లా కబడ్డీ అసోసియేషన్ నాయకులు కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికా రు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కబడ్డీ క్రీడాకారులు అనేకమంది ఉన్నారన్నారు. జాతీయ స్థాయి ఆటగాళ్లను మరింత ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉ పాధ్యక్షుడు ఎస్.రాంచందర్, అథ్లెటిక్స్ అసో యేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబమూర్తి, క్రీడాకారులు కార్తీక్, శ్రీధర్, లింగయ్య, ఉపేందర్, రాజేందర్, మంజుల పాల్గొన్నారు.