
ఈజీఎస్ పనులు పరిశీలన
బెల్లంపల్లిరూరల్: మండలంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆది వారం కేంద్ర జలశక్తి అభియాన్ టీం అధికారులు పరిశీలించారు. ఆకెనపల్లి, పాతబెల్లంపల్లి, కన్నాల, అంకుశం, బుధాకుర్థు, బుధాకలాన్, గురిజాల, మాలగురిజాల, బట్వాన్‌పల్లి, దుగ్నెపల్లి, పెర్కపల్లి గ్రామాల్లో ఇంకుడు గుంతలు, చెరువుల్లో నిర్మించిన ఫారమ్ పాండ్స్, ఫిష్ పాండ్స్‌ను టీం అధికారి కె.రాంబాబు తనిఖీ చేశారు. జలశక్తి అభియాన్ పనులు ఏవిధంగా ఉన్నాయి, వాటితో ఎంతమేరకు నీటిని పొదుపు చేయగలుగుతున్నారు.. అనే అంశాలపై ఆరా తీశారు. నీటిని పొదుపుపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం రాంబాబును మండల అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మహేందర్, డీఆర్‌డీవో కార్యాలయ అధికారి సదానందం, ఏపీవో ఏస్తర్ డేవిడ్, ఈసీలు సత్యనారాయణ, అనిత్ తదితరులు పాల్గొన్నారు.