
కాచి చల్లార్చిన నీటిని తాగించాలి
పిల్లలకు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగించాలి. అపరిశుభ్రమైన పరిసరాల్లోకి వెళ్తే వారి చేతులను సబ్బుతో కడగాలి. తల్లి కూడా పరిశుభ్రతను పాటిస్తూ పాలిచ్చే ముందు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చేతిగోళ్లు పెంచుకోకపోవడం, తినే ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూతలు పెట్టడం, పిల్లలకు అప్పుడే వండిన ఆహార పదార్థాలు ఇవ్వడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను ఇవ్వకపోవడం మంచిది. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారాన్నే తినిపించాలి. బయటి ఆహారంతో డయేరియాతోపాటు, ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్ అనిత, జిల్లా ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాం అధికారి