
బీసీల్లో రాజకీయ చైతన్యం రావాలి
పాతమంచిర్యాల: బీసీల్లో రాజకీయ చైతన్యం రావాలని ఓబీసీ పోరుబాట పుస్తక రచయిత, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని నార్త్ ఇన్ హోటల్‌లో ఆదివారం పుస్తకం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ బీసీలు సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారిని చైతన్యం చేయడానికి పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. బీసీలు ఎలాంటి ఉద్యమాలు చేయాలో, తమ హక్కుల కోసం ఎలా పోరాడాలో పుస్తకంలో వివరించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ ఉద్యమ నేత ప్రసన్న హరికృష్ణ, టీబీజీకేస్ నాయకులు కెంగెర్ల మల్లయ్య, నాయకులు సంధ్యారాణి, నరెడ్ల శ్రీనివాస్, నీలి శ్రీనివాస్, భావన రుషి, గాజుల ముఖేశ్‌గౌడ్ పాల్గొన్నారు.