● రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా, డీఆర్వోగా
అదనపు బాధ్యతలు తీరేనా?
జిల్లాకు ఐఏఎస్ స్థాయి అధికారులు ఇద్దరిని కేటాయిస్తే అదనపు కలెక్టర్ల కొతర తీరుతుంది. ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న జిల్లా రెవె న్యూ అధికారి(డీఆర్వో) ఇక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కే అదనంగా ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులుగా పని చేయాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికలు జరిగి పాలకవర్గాలు కొలువుదీరితే ఈ అదనపు బాధ్యతలు తప్పే అవకాశం ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నత స్థానాల్లో ఖాళీలు లేకుండా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కలెక్టర్‌కు పది బాధ్యతలు.. అవును. మీరు చదివింది నిజమే. సా ధారణంగా కలెక్టర్ అంటేనే జిల్లాకు బాస్. అంటే అ న్ని ప్రభుత్వ శాఖలను పర్యవేక్షించే అధికారం ఉంటుంది. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. పా లన పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకా లు, ప్రజా కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాత్రం కొద్ది రోజులు గా పది మంది అధికారులు నిర్వర్తించే బాధ్యతలు ఒక్కరే నిర్వర్తిస్తుండడం గమనార్హం.
అదనపు కలెక్టర్లు లేక..
కీలకమైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఆ ర్వో(జిల్లా రెవెన్యూ అధికారి) పోస్టు ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటోంది. ఈ పోస్టులోనూ అదనపు క లెక్టరే బాధ్యతలు నిర్వర్తించేవారు. ఇక జిల్లా పరి షత్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేక అధికా రిగా ఉన్నారు. అంతేగాక జిల్లాలోని లక్సెట్టిపేట, చె న్నూర్, క్యాతనపల్లి, మందమర్రి, బెల్లంపల్లి ము న్సిపాల్టీలకు పాలకవర్గాలు లేక ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు.
నిత్యం బిజీగా..
జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్‌గా అన్ని శాఖలను సమన్వ యం చేస్తూ.. కలెక్టర్ హోదాలో పలు కమిటీలకు బాధ్యులుగా ఉంటారు. ప్రతీవారం ప్రజాఫిర్యాదు ల విభాగం నిర్వహించాలి. నిత్యం శాఖల వారీగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూ సమీక్షించాలి. ఇక జిల్లాలో ప్రభుత్వ పరంగా ఏ పని జరగాలన్నా కలెక్టర్ ఆమోదం తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అమలు చే యాల్సి ఉంటుంది. జిల్లాలో అమలు అవుతున్న ఆ యా పథకాలు, కార్యక్రమాల నివేదికను పై అధికా రులకు పంపించాలి. ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, భూ భారతి అమలు, రేషన్‌కార్డుల జారీ సన్నబియ్యం పంపిణీ, మొన్నటివరకు ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ వీటితోపాటు విద్యాసంవత్సరం ఆరంభం, ప్రభుత్వ, వసతిగృహాలపై పర్యవేక్షణ, వైద్యం, వానాకాలంలో అప్రమత్తం తదితరవన్నీ పర్యవేక్షిస్తున్నారు.
ఏడాదిపూర్తి
గతేడాది జూన్ 16న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కుమార్ దీపక్ పాలనకు సోమవారంతో ఏడాది పూర్తయింది. ఆయన కంటే ముందు ఇక్కడ బదావత్ సంతోష్ కలెక్టర్‌గా పని చేశారు. ఇక్కడికే శిక్షణ కలెక్టర్‌గా వచ్చి మొదటిసారి ఓ జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
● రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా, డీఆర్వోగా


