
రికార్డుల ‘హర్షిణి’
జిల్లా కేంద్రంలోని ఠాకూర్ ప్రదీప్ సింగ్– అనూష దంపతుల కుమార్తె హర్షిణి కూచిపూడి నృత్యంలో అరుదైన రికార్డులను సాధిస్తుంది. 2022 నుంచి ఇప్పటివరకు 11 అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. 2022లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 2023లో తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఫెంటాస్టిక్ అచీవ్మెంట్స్ అండ్ రికార్డ్స్, జేమ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా రికార్డ్స్ దక్కాయి. ఇప్పటివరకు 40కి పైగా జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి వేదికలపై అద్భుత ప్రదర్శనలు ఇచ్చింది. తల్లి ప్రోత్సాహంతో రాణిస్తున్నానని హర్షిణి తెలిపింది.