
● నృత్యంలో రాణిస్తున్న చిన్నారులు ● మహా బృంద నాట్యంలో
ఆదిలాబాద్: చిన్నారులు ఆయా వేదికల్లో శాసీ్త్రయ నృత్యంలో ప్రతిభ కనబరుస్తున్నారు. అందులోనే రాణిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుతున్నారు. వారే జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకుంటూ గిన్నిస్ రికార్డులకెక్కిన చిన్నారులు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2023 డిసెంబర్ 24, 25వ తేదీల్లో కూచిపూడి కళా వైభవం–మహా బృందనాట్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనలో 4,218 మంది నృత్యకారిణులు ఒకేసారి ప్రదర్శించి గిన్నిస్ రికార్డు సాధించారు. వారిలో బాల కేంద్రానికి చెందిన 26 మంది కూచిపూడి చిన్నారి నర్తకులు ఉండడం విశేషం.
గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులు..
గడ్డం శ్రీనిధి, దువాస హర్షిని, పన్నాల లాస్య, ఠాకూర్ హర్షిని, అక్షర గీత, క్షీరసాగర్ జాహ్నవి, సన్నిధి దేశ్ముఖ్, కుర్ర భవిష్య, జాబు శ్రీ వర్ధిని, ఆర్. ఓజస్విని, నాలంవార్ మహాలక్ష్మి, గుండేటి అశ్విత, ఉపలంచివార్ అక్షిత, కొంకటీ ఇతీక్ష, పోలాజి ఉమారాణి, మోర శ్రేష్ట, సామ మహతి, చిలుక ఆమని, మామిడి అక్షయ, అవరగొండ సంజన, యానాకి నక్షత్ర, మచ్చ సాత్విక, కటకం భావనశైని, కొండ్ర అలేఖ్య, కానిందే మహాశ్రీ, రామోజీ రచన.
గిన్నిస్ రికార్డు సాధించిన బాలకేంద్రం చిన్నారులతో కలెక్టర్ రాజర్షి షా
నాట్యశిఖామణి ‘ఆమని’
కై లాస్‌నగర్ కాలనీకి చెందిన చిలుక వెంకటస్వామి–అన్నపూర్ణ దంపతుల కుమార్తె ఆమని 2021 నుంచి బాలకేంద్రంలో కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు చేస్తూ ఎన్నో వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చింది. అద్భుత కళా నైపుణ్యంతో అన్నమయ్య పురస్కారాన్ని సాధించింది. ఇప్పటివరకు 10 రికార్డులు సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఈవెంట్లో పాల్గొని ధ్రువపత్రాన్ని అందుకుంది.

● నృత్యంలో రాణిస్తున్న చిన్నారులు ● మహా బృంద నాట్యంలో

● నృత్యంలో రాణిస్తున్న చిన్నారులు ● మహా బృంద నాట్యంలో