
సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మృతి
మందమర్రిరూరల్/పాతమంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణా నికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ (69) అ నారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి లో ఆదివారం ఉదయం మృతిచెందారు. నెల రోజు లుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని మంచిర్యాలలోని నివాసానికి తీసుకువ చ్చారు. మధ్యాహ్నం వరకు సందర్శనార్థం అక్కడే ఉంచారు. పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం పార్థివదేహాన్ని సాయంత్రం మందమర్రిలోని సీఈఆర్ క్లబ్ మీదుగా ఈద్గాకు తరలించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్సీ కోదండరామ్, యూనియన్ నేతలు, స్నేహితులు, తోటి పాత్రికేయులు, రాజకీ యనాయకులు, అభిమానులు నివాళులర్పించారు.
ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్‌గా ప్రస్థానం
మునీర్ ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్‌గా జిల్లాలో చెరగని ముద్రవేశారు. విద్యార్థి దశలో ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేసి, సీపీఐలో చురుకైన నాయకుడిగా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నారు. 1981లో సింగరేణిలో కార్మికుడిగా చేరి, భూస్వాముల అరాచకాలపై పో రాటాలు చేశారు. 1982లో హత్య కేసులో నిందితుడిగా శిక్ష పొందినా, హైకోర్టు కేసును కొట్టివేసింది. ఇక జర్నలిస్టుగా వివిధ పత్రికల్లో 40 ఏళ్ల్లు పనిచేశా రు. 2008లో సింగరేణి గోల్డెన్ హ్యాండ్‌షేక్ పథకం ద్వారా ఉద్యోగ విరమణ పొంది, జర్నలిజంలో కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్‌గా సమ్మెను విజయవంతం చేశారు.
పలువురి నివాళి
మునీర్ మృతికి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, కోనేరు కోనప్ప, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్‌ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తంచేశారు. మునీర్‌కు భార్య రిజ్వానా, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మృతి