
శత జన్మదిన సందడి
● వాగ్దారిలో ఓ వృద్ధుడి వందో పుట్టినరోజు వేడుక
నేరడిగొండ: మండలంలోని వాగ్దారి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడి శత జన్మదిన సంబురం కుటుంబ సభ్యులు, గ్రామస్తుల మధ్య ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన బదావత్ కిర్యానాయక్ 1925 మే 24న జన్మించాడు. శనివారంతో వందేళ్లు పూర్తికాగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిర్యానాయక్ కేక్ కట్ చేశారు. తన ఆరోగ్యానికి జీవనశైలే కారణమని పేర్కొన్నాడు. కార్యక్రమంలో ఐదు తరాల వారసులు పాల్గొని సందడి చేశారు.