
భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త
మంచిర్యాలక్రైం: భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త, ఆయన సేవలు చిరస్మరణీయమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం భాగ్యరెడ్డి వర్మ జ యంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఆ యన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ సంస్థానంలో సంఘ సంస్కరణల కోసం అనేక పోరా టాలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, స్పెషల్‌బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం, ఆర్‌ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేష్, సీపీవో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.