
20 రోజులుగా అరిగోస పడుతున్నా..
అధికారులు చెప్పేది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ధాన్యం సెంటర్‌కు తెచ్చి 20 రోజులు అవుతుంది. పోయిన వారం కురిసిన వర్షంతో తడవకుండా కాపాడుకునేందుకు అరిగోస పడుడు అయ్యింది. బస్తాలు తడిసిపోవడంతో మళ్లీ అరబోసుకొని బస్తాలు నింపి తూకం కోసం ఎదురు చూసుడు అయ్యింది. రెండు సార్లు బస్తాలు మార్చుడు అయ్యింది. ఇప్పుడు కాంటా పెడుతుంటే రోజులుగా వర్షం వీడడం లేదు. బస్తాల్లోకి నీళ్లు ఎక్కడ పోతాయోనని వర్షంలోనే కాల్వలు తీస్తున్నా.
– రాజగౌడ్, గ్రామం: కిష్టంపేట్, మం: చెన్నూర్