
పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి
తాండూర్: పండుగలు ప్రశాంతంగా జరుపుకోవా లని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచించారు. జి ల్లా సరిహద్దు తాండూర్ మండలం రేపల్లెవాడ శివా రు జాతీయ రహదారిపై మంగళవారం చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. బక్రీద్ నేపథ్యంలో చెక్‌పోస్టు వద్ద నిత్యం నిరంతరంగా తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం తాండూర్ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి ఏసీపీ రవికుమార్ హాజరై పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో తాండూర్ సీఐ కుమారస్వామి, ఎస్సైలు కిరణ్‌కుమార్, సౌజన్య, ముస్లిం మత పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పశువులను పరిమితికి మించి తరలిస్తే చర్యలు
చెన్నూర్: పండుగలను కులమతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, బక్రీద్ పండగ నేపథ్యంలో పరిమితికి మించి పశువులను రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. స్థానిక సీఐ కార్యాలయంలో ముస్టిం పెద్దలతో సమావేశమై మాట్లాడారు. పశురవాణాపై ఎవరికై నా సమాచా రం ఉంటే వెంటనే పోలీసులకు తెలుపాలని సూ చించారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకో రాదని, వాహనాలు ఆపే హక్కు ఎవరికీ లేదని తెలి పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిచారు. సీఐ దేవేందర్‌రావు, కోటపల్లి సీఐ సుధాకర్, ఎస్సై సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్, పశు వైద్యాధికారులున్నారు.