
ఓంకార్ శతజయంతి పోస్టర్లు విడుదల
బెల్లంపల్లి: ఎంసీపీఐ(యూ)వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శతజ యంతి ఉత్సవాల పోస్టర్‌ను బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఓంకార్ ప్రజల పక్షాన అనేక పోరా టా లు చేశారన్నారు. తన జీవితాన్నీ ప్రజలకు అంకితం చేసిన నాయకుడని పేర్కొన్నారు. ఓంకార్ శతజయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్, పట్టణ కార్యదర్శి రమేశ్, మండల కార్యదర్శి సతీశ్, నాయకులు పాల్గొన్నారు.