
భూభారతితో వివాదాలు దూరం
● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
వేమనపల్లి: భూభారతి చట్టంతో భూ వివాదాలు దూరమవుతాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినో ద్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జాయింట్ కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి నీ ల్వాయి రైతువేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ధరణితో గ్రామాల్లో లక్షలాది భూ వివాదాలు తలెత్తాయని, సాదాబైనామా, ఆర్‌ఓఆర్, మ్యుటేషన్, అన్ని రకాల భూ సమస్యలకు భూభారతితో పరి ష్కారం దొరికిందని అన్నారు. రికార్డు ప్రకారం ఏ తప్పులు ఉన్నా మార్పులు, చేర్పులు, విరాసత్ పట్టా, పాలు పంపకాలు, దస్తావేజులు సరి చేసుకో వడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. అ నంతరం 19మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చె క్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరి కృష్ణ, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ కుమారస్వామి, మాజీ జెడ్పీటీసీ సంతోష్‌కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాబీర్‌ఆలీ పాల్గొన్నారు.
‘అప్పులపాలు చేసిన కేసీఆర్’
వేమనపల్లి: తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పా ర్టీదైతే అనుభవించి అప్పుల పాలు చేసింది కేసీఆర్ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ విమర్శించా రు. మంగళవారం నీల్వాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులపాలు చేశారని, ప్రభుత్వం ఏటా 65 వేల కోట్ల మిత్తిలు చెల్లిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సంతోష్‌కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాబీర్‌ఆలీ, గాలి మధు, సత్యనారాయణ, రాజన్న పాల్గొన్నారు.