
అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర
జన్నారం/బెల్లంపల్లి/కోటపల్లి: జిల్లాలోని జన్నారం, బెల్లంపల్లి, తాండూర్, కోటపల్లి మండలాల్లో శనివారం రాత్రి వరణుడు అన్నదాతపై కన్నెర్రజేశాడు. అకాల వర్షంతో కల్లాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. మామిడి కాయలు నేలరాలాయి. జన్నారం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వరదలో కొట్టుకుపోగా, బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో మామిడి కాయలు గాలి దుమారంతో నేలరాలాయి. ఈ ప్రకృతి విపత్తు రైతులను ఆర్థక దెబ్బతోపాటు మానసిక ఆఘాతంలోకి నెట్టింది. రాత్రి 11 గంటల సమయంలో జన్నారం మండలంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని వరదలో కొట్టుకుపోయింది. పొనకల్, ఇందన్‌పల్లి, మొర్రిగూడ, కవ్వాల్, రేండ్లగూడ వంటి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి, కొన్ని చోట్ల నీటిలో కొట్టుకుపోయింది. ఆలస్యంగా కల్లాల వద్దకు చేరుకున్న రైతులు ధాన్యం కాపాడుకునేందుకు ప్రయత్నించారు. బెల్లంపల్లి, తాండూర్ మండలాల్లో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన అ కాల వర్షం, గాలి దుమారంతో మామిడి పంటకు తీవ్ర నష్టం కలిగించింది. గాలి దుమారం కారణంగా చెట్లపై ఉన్న మామిడి కాయలు నేలరా లాయి. మరో వారంలో కాయలను సేకరించాలని ఆశించిన రైతులు, వ్యాపారులకు ఈ విపత్తు ఆర్థిక దెబ్బతీసింది. ప్రభుత్వం స్పందించి, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని, మామిడి రైతులకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. కోటపల్లి మండలంలో ఆకాల వర్షానికి కల్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.
కుప్పపై నిలిచిన నీటిని
ఎత్తివేస్తున్న మహిళ
పొనకల్ మార్కెట్ యార్డులో వరదకు కొట్టుకుపోయిన ధాన్యం
అకాల వర్షంతో వరి ధాన్యం వరదపాలు
నేలరాలిన మామిడి కాయలు
ఆదుకోవాలని బాధిత రైతుల వేడుకోలు

అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర

అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర

అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర

అన్నదాతపై ప్రకృతి కన్నెర్ర