
మండుతున్న సూరీడు
● 44.3 డిగ్రీలకు చేరుకున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ● వడదెబ్బతో జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు మృతి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సూరీడు భగ భగ మండిపోతున్నాడు. నాలుగు రోజులుగా జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడదెబ్బ తగిలి జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు మృతిచెందారు. ఉదయం ఎండలు, సాయంత్రం కాగానే మబ్బులు కమ్ముకొని ఈదురుగాలులు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. మంగళవారం భీమారం మండలంలో 44.3 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. నాలుగు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండ వేడిమి మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సింగరేణి బొగ్గు గని ఏరియాలో ఎండవేడిమి మరింత ఎక్కువగా ఉంటోంది. ఓపెన్‌కాస్టుల్లో కార్మికులు అల్లాడిపోతున్నారు. రానున్న మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో గత నాలుగు రోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
గొడుగుతో వెళ్తున్న కలెక్టరేట్ ఉద్యోగులు
తేదీ కనిష్టం గరిష్టం
19 26.2 42.6
20 27.6 42.8
21 28.4 43.6
22 29.2 44.3

మండుతున్న సూరీడు