
వక్ఫ్ సవరణ చట్టంపై తప్పుడు ప్రచారం
మంచిర్యాలటౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ పై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తప్పుడు ప్రచా రం చేస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, నాయకులతో కలిసి ఆది వారం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బో ర్డును ప్రక్షాళన చేయాలని, వక్ఫ్ ఆస్తులు పేద ముస్లింలకు దక్కాలని సవరణ బిల్లు తీసుకువచ్చిందన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంఐఎం, ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ స్వలాభం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఇన్ని రోజులుగా వక్ఫ్ ఆస్తుల పేరుతో సంపన్న ముస్లిం పెద్దలు అవినీతికి పాల్పడి ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. కొన్ని మతతత్వ పార్టీలు ముస్లిం మైనారీటీ ఓటు బ్యాంక్ కోసం ముస్లింలలో అపోహలు సృష్టించి తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పట్టి వెంకటకృష్ణ, కొయ్యల ఏమాజీ, గాజుల ముఖేశ్‌గౌడ్, తాజ్‌ఖాన్, ఎనగందుల కృష్ణమూర్తి, అమిరిశెట్టి రాజు, వంగపల్లి వెంకటేశ్వర్‌రావు, మాసు రజిని, అక్కల రమేశ్, రాకేశ్ రెన్వా, చిరంజీవి పాల్గొన్నారు.