నస్పూర్: సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ(ఆపరేషన్స్), కె. వెంకటేశ్వర్లు(ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్)తెలిపారు. సీసీసీ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శనివారం నిర్వహించిన 17వ వార్షికోత్సవానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో విద్యాసంస్థల ద్వారా సింగరేణి ఉద్యోగుల పిల్లలకు, తెలంగాణలోని ఇతర విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యనందించి వారి బంగారు భవిష్యత్తుకు సంస్థ దోహదపడుతుందన్నారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం వారు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్, సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ శ్రీనివాస్, కళాశాల కరస్పాండెంట్ రాజేశ్వర్, ప్రిన్సిపాల్ డి నరసింహస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.