పాతమంచిర్యాల: తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం చరిత్రాత్మక ముందడుగు అని కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠేశ్వర్‌రావు, బీసీ జేఎసీ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సేవాదళ్, బీసీ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనజ, సంయుక్త కార్యదర్శి జంగు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి రాజిరెడ్డి, బీసీ జేఏసీ జిల్లా నాయకుడు డాక్టర్ రాజ్‌కిరణ్, జిల్లా నాయకులు గుమ్ముల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుతో న్యాయం
మంచిర్యాలటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ క ల్పిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంతో బీసీలకు న్యాయం జరుగుతుందని ఏఐసీసీ రా ష్ట్ర ఓబీసీ కోఆర్డినేటర్ ముత్తినేని రవికుమార్ ఒక ప్ర కటనలో తెలిపారు. బిల్లును అమలు చేస్తే రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం సాధించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు.