
పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
● రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం
మంచిర్యాలఅగ్రికల్చర్: అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధా న కార్యదర్శి బుర్ర వెంకటేశం అన్నారు. బుధవారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను విద్యాసంవత్సరం ప్రారంభంలో గా పూర్తి చేసి పాఠశాలలను సిద్ధంగా ఉంచాల ని తెలిపారు. ప్రతీ పాఠశాలలో తాగునీరు, మూత్రశాలలు, విద్యుద్దీకరణ పనులతోపాటు తరగతి గదులు సిద్ధంగా ఉంచాలని అన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా ప్రత్యేక అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి ల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వి ద్యాధికారి యాదయ్య పాల్గొన్నారు.