లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

Published Wed, May 29 2024 12:15 AM

లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

చెన్నూర్‌: లోక్‌ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసు ల పరిష్కారానికి పోలీసు అధికారులు, కోర్టు పోలీ సులు కృషి చేయాలని జడ్జి రవి అన్నారు. వచ్చే నెల 8న లోక్‌ అదాలత్‌ నేపథ్యంలో మంగళవారం స్థాని క కోర్టులో చెన్నూర్‌ కోర్టు పరిధిలోని పోలీసు అధి కారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి రవి మాట్లాడుతూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, చెక్‌బౌన్స్‌ కేసులు, సివిల్‌ కేసులతోపాటు ఇతర కేసుల్లో ఇరుపక్షాలు రాజీపడే విధంగా కక్షిదా రులకు అవగాహన కల్పించాలని అన్నారు. లోక్‌ అ దాలత్‌కు మరో పది రోజుల గడువు ఉండడంతో ఎ క్కువ సంఖ్యలో కక్షిదారులతో మాట్లాడే అవకాశం ఉందని తెలిపారు. చెన్నూర్‌, కోటపల్లి సీఐలు రవీందర్‌, సుధాకర్‌, శ్వేత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేశ్‌చందర్‌గిల్డా, ఏజీపీ రాంభావు, ఎకై ్సజ్‌, బ్యాంక్‌ మేనేజర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement