
సిబ్బందికి సూచనలు చేస్తున్న డీఎంహెచ్‌ఓ సుబ్బరాయుడు
వేమనపల్లి: ఎండలు పెరుగుతుండడంతో ప్రమాదం పొంచి ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎఅండ్‌హెచ్‌ఓ సుబ్బరాయు డు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. రికార్డులు పరిశీలించారు. చేశారు. సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉపాధిహామీ పనుల స్థలాలు, వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలకు అందుబాటులో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచాలని, ఎండ వేడికి తట్టుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలకు సూచించారు. వడదెబ్బ బారిన పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, వేసుకోవాల్సి న దుస్తువులపై వివరించారు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ రికార్డులు అప్‌డేషన్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, పీహెచ్‌సీలో ప్రసవాలు జరిగేలా అంకితభావంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రఓమంలో వైద్యాధికారి రాజేష్, హెల్త్ అసిస్టెంట్ ఆర్.బాపు, లింగన్న, ఏఎన్‌ఎంలు విజయలక్ష్మి, రాజేశ్వరి, మంజుల, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.