
దొనబండ కొనుగోలు కేంద్రంలో ఐకేపీ నిర్వాహకులతో మాట్లాడుతున్న కలెక్టర్
● జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ● అధికారులతో సమావేశం
సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి
మందమర్రిరూరల్: జిల్లాలోని రైస్‌మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ నిర్దేశిత లక్ష్యాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ బి.సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, మందమర్రి తహసీల్దా ర్ చంద్రశేఖర్‌తో కలిసి మందమర్రి పట్టణంలోని వెంకటేశ్వర రైస్‌మిల్, వాసవి రైస్‌మిల్, ఆదిల్‌పేట్‌లోని నీలం బ్రదర్స్ రైస్‌మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద వరిధాన్యం పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి రాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
మంచిర్యాలఅగ్రికల్చర్: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి ప నులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్, జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాశాఖ అధికా రి ఎస్.యాదయ్యలతో కలిసి మున్సిపల్ కమిషన ర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, మెప్మా, ఏపీఎం, ఇంజినీరింగ్ విభాగం అధికా రులకు అభివృద్ధి పనుల నిర్వహణపై శిక్షణ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, తా గునీటి సౌకర్యాలు కల్పించడం, చిన్న, పెద్ద మరమ్మతులు చేపట్టడం, ఇప్పటికే ఉన్న, పనిచేయని మూతశ్రాలల పునరుద్ధరణ, నిర్వహణ, తరగతి గ దుల విద్యుద్దీకరణ, పాఠశాల ఆవరణలో పారిశు ధ్య నిర్వహణ, విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు సోలార్ ప్యానళ్ల ఏర్పాటు లక్ష్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పని చేస్తుందని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం హాజీపూర్ మండలం గుడిపేట, రాపల్లి, దొనబండ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో 262 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ధాన్యం కొ నుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, డీఆర్‌డీఓ కిషన్, పౌరసరఫరాల శాఖా జిల్లా మేనేజర్ గోపాల్, హాజీపూర్ తహసీల్దార్ సతీశ్‌కుమార్, గిర్దావర్ ప్రభు పాల్గొన్నారు.
కనీస మద్దతు కల్పించేందుకే..
మంచిర్యాలఅగ్రికల్చర్: రైతులకు కనీస మద్దతు కల్పించేందుకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బి.సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజిద్, జిల్లా మేనేజర్ గోపాల్‌తో కలిసి రైస్‌మిల్లర్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయని రైస్‌మిల్లులపై రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.