సీలింగ్‌ భూమి అక్రమంగా పట్టా..? | - | Sakshi
Sakshi News home page

Mar 4 2023 7:22 AM | Updated on Mar 4 2023 7:22 AM

జన్నారం(ఖానాపూర్‌): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం సింగరాయిపేట్‌ గ్రామ శివారులోని చెరువు సీలింగ్‌ భూమిని తపాలపూర్‌ గ్రామానికి చెందిన ఇద్దరు కబ్జా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధుల కుమారులపై సుమారు 7 ఎకరాల భూమి అక్రమంగా పట్టా చేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. సింగరాయిపేట్‌ గ్రామ శివారులోని శిఖం భూమిని సీలింగ్‌ భూమిగా చేసి ఒకరి పేరున 5 ఎకరాలు, మరొకరి పేరున 2.200 ఎకరాలు అక్రమంగా పట్టా చేయించుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ పట్టాపై బ్యాంకులో ఇటీవల రుణం కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. గ్రామంలో ఇరువర్గాల మధ్య వివాదాల వల్ల ఈ విషయం బయటకు వచ్చింది. ఆ భూమి శిఖం భూమి అని కొందరు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై డీటీ రామ్మోహన్‌ను సంప్రదించగా.. సీలింగ్‌ భూమి వారసత్వంగా తప్పా పట్టా కావడానికి వీలుండదని, ధరణి వచ్చిన నుంచి అలాంటి భూములు పట్టాలు కాలేదని తెలిపారు. ధరణికి ముందు వచ్చి ఉండవచ్చని, పూర్తి విచారణ జరిపిస్తామని తెలిపారు.

నిర్మల్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌కు పితృవియోగం

నేరడిగొండ: నిర్మల్‌ జిల్లా పరిష త్‌ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మికి పితృవియోగం కలిగింది. విజయలక్ష్మి తండ్రి ఎర్ర గంగారెడ్డి (96) శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు మండలంలోని ఆయన స్వగ్రామైన తర్నం(కె)కు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. నిర్మల్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు బాధిత కుటుంబీకులను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement