రాష్ట్రస్థాయిలో పాలమూరు ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయిలో పాలమూరు ప్రతిభ

Feb 25 2026 10:18 AM | Updated on Feb 25 2026 10:18 AM

రాష్ట

రాష్ట్రస్థాయిలో పాలమూరు ప్రతిభ

సీఎం కప్‌ క్రీడల్లో 30 పతకాలు కై వసం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: గ్రామీణస్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రెండో ఎడిషన్‌ సీఎం కప్‌ క్రీడా పోటీల్లో పాలమూరు క్రీడాకారులు ప్రతిభ చాటారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో రాణింపు..

ఈ నెల 20వ తేదీ తేదీ నుంచి 23 వరకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి సీఎం కప్‌ క్రీడా పోటీలను నిర్వహించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి బాక్సింగ్‌, నెట్‌బాల్‌ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో మహబూబ్‌నగర్‌ జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. ఏకంగా 30 పతకాలు సాధించినట్లు అధికారులు పేర్కొన్నారు.

పతకాల వివరాలు

మహబూబ్‌నగర్‌ జిల్లా క్రీడాకారులు 30 పతకాలు సాధించగా.. 6 బంగారు, 9 వెండి, 15 కాంస్య పతకాలు సాధించారు. నెట్‌బాల్‌లో మహబూబ్‌నగర్‌ బాల, బాలికల జట్లు బంగారు పతకాలు, కరాటేలో కె.శివప్రసాద్‌, అథ్లెటిక్స్‌లో కె.శివ, కార్తీక్‌ బంగారు పతకాలు, వెయిట్‌ లిఫ్టింగ్‌లో వి.సహస్ర బంగారు పతకం, ఆర్చరీలో కృతిక్‌ శ్రీవాస్తవ్‌, స్మృతి సన్నిభా, వెయిట్‌లిఫ్టింగ్‌లో బాలకృష్ణ, బాక్సింగ్‌లో మధు, కిక్‌ బాక్సింగ్‌లో వరుణ్‌చంద్‌నాయక్‌, బృందా, అథ్లెటిక్స్‌లో కె.శివ కార్తీక్‌, పౌర్ణమి వెండి పతకాలు, యోగాలో అర్వ లక్ష్మీప్రహర్ష, బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో మనస్వి– సరోజ, సింగిల్‌లో రిశిత, మహబూబ్‌నగర్‌ హ్యాండ్‌బాల్‌ మహిళల జట్టు, బాక్సింగ్‌లో మణికౌషిక్‌, రమావత్‌ అనూష, తైక్వాండోలో దీక్షిత, బేస్‌బాల్‌లో జిల్లా బాల, బాలికల జట్లు, సాఫ్ట్‌బాల్‌లో మహబూబ్‌నగర్‌ మహిళల జట్టు, వెయిట్‌లిఫ్టింగ్‌లో సునీత, నందకిషోర్‌, కిక్‌ బాక్సింగ్‌లో అర్ఫాఫాతిమా, అథ్లెటిక్స్‌లో కె. శివ, కార్తీక్‌, సాయిచరణ్‌ కాంస్య పతకాలు సాధించారు.

రాష్ట్రస్థాయిలో పాలమూరు ప్రతిభ 1
1/1

రాష్ట్రస్థాయిలో పాలమూరు ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement