రాజీ మార్గం.. ఇరువర్గాలకు న్యాయం
● నేడు జాతీయ లోక్ అదాలత్
మహబూబ్‌నగర్ క్రైం: దేశ్యాప్తంగా న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉంటున్నాయి. సకాలంలో న్యాయం పొందక..ఏళ్లుగా తిరుగుతూ ఆర్థిక, శారీరకంగా వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో లోక్ అదాలత్‌లలో ఇరు వర్గాలను ఒకే వేదికపై హాజరుపర్చి న్యాయమూర్తుల సమక్షంలో వారి సమస్యలను సామరస్యంగా రాజీ పద్ధతిలో సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో కోర్టు పరిధిలో రాజీ పడదగిన కేసులన్నింటినీ పరిష్కరించుకునేందుకు ఆదివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 5 బెంచీలు ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా కోర్టులో 3 బెంచీలు, జడ్చర్లలో 2 బెంచీలలో కేసుల సివిల్, మోటార్ వెహికిల్, ఫ్యామిలీ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అన్ని రకాల సివిల్, క్రిమినల్ కేసులు, భూ తగాద కేసులు, కుటుంబ వివాదకేసులు, మోటార్ వెహికిల్ కేసులను ఇద్దరు రాజీపడి కేసులను పరిష్కరించుకోవచ్చు. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, బాలికపై లైంగిక దాడులు, దొంగతనాలు, దోపిడీలు, ప్రత్యేక చట్టాలపై నమోదైన కేసులను, క్రూరమైన కేసును లోక్ అదాలత్‌లో రాజీకి వీల్లేదు.


