తాత x మనువడు
అడ్డాకుల: మూసాపేట మండలం చక్రాపూర్‌లో తాత, మనువడి సమరం రసవత్తరంగా సాగుతోంది. సర్పంచ్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించడంతో బీఆర్‌ఎస్ మద్దతుతో గంటెల రఘురాములు, కాంగ్రెస్ మద్దతుతో అతడి సోదరుడి మనువడు లక్ష్మీనారాయణ పోటీపడుతున్నారు. ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో నువ్వా–నేనా అన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా గతంలో రఘురాములు తల్లి వెంకటమ్మ రెండు పర్యాయాలు, లక్ష్మీనారాయణ తండ్రి పెద్ద వెంకటయ్య ఒక పర్యాయం సర్పంచ్‌గా సేవలందించారు. పెద్ద వయస్కుడైనందున తనకు చివరిసారి ఒక అవకాశం ఇవ్వాలని తాత.. గ్రామస్తులకు సేవలందిస్తున్నందున తనకు అవకాశం కల్పించాలంటూ మనువడు ప్రచారం సాగిస్తున్నారు. విజేత ఎవరన్నది ఈ నెల 17న తేలనుంది.
తాత x మనువడు


