కాలిన గాయాలతో తల్లీకొడుకు మృతి
ధరూరు: మండల కేంద్రంలో ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న తల్లీకొడుకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక కుర్వ వీధిలో గ్యాస్ లీకై చెలరేగిన మంటల్లో సునీత, అశ్విని, అశ్విని ఏడాదిన్నర కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఐదు రోజులుగా కర్నూల్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురిలో ఏడాదిన్నర బాబు బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చనిపోగా.. ఆ బాలుడి తల్లి అశ్విని (22) సాయంత్రం మృతి చెందింది. చికిత్స పొందుతున్న తల్లీ, కుమారుడు ఒకేరోజు చనిపోవడంతో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తీవ్రంగా గాయపడిన గర్భిణి సునీత బుధవారం ప్రసవించగా.. శిశువు చనిపోయినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు వాపోయారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
కాలిన గాయాలతో తల్లీకొడుకు మృతి


