ఘనంగా మహబూబ్‌నగర్ అవతరణ వేడుకలు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆరో నిజాం నవాబ్ మీర్ మహబూబ్‌అలీ ఖాన్ బహద్దూర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంఏ రహీమ్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ 135వ అవతరణ దినోత్సవాన్ని గురువారం జిల్లాకేంద్రంలోని మహెబూబియాలో హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నైజాం ప్రాంతం చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. మహబూబ్‌నగర్‌లో గంగాజమున తహ్‌జిబ్‌లా హిందూ–ముస్లింలు కలిసిమెలిసి ఉంటారన్నారు. ఒకరి పండుగల్లో మరొకరు పాలుపంచుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అనంతరం అతిథులను ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంఎ రహీం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, రిటైర్డ్ ఆర్మీ పాండురంగారెడ్డి, తామీరే మిల్లత్ అధ్యక్షుడు మహ్మద్ జియావుద్దీన్ నాయర్, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ, తదితరులు పాల్గొన్నారు.
3 రోజుల్లో ధాన్యం డబ్బులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వానాకాలం 2025–26 సీజన్‌కు చెందిన రైతుల నుంచి వడ్ల కొనుగోలు చేసిన మూడు రోజుల్లో అందుకు సంబంధించి డబ్బులను మూడు రోజుల్లో వా రి ఖాతాల్లో జమ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ ఆదేశించారు. గురువా రం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల దృష్ట్యా రైతు లకు పేమెంట్ విషయంలో ఎక్కడ కూడా ఇ లాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం కృషి చేయాలన్నారు. డబ్బులు సకాలంలో చెల్లించేందుకు అడిషనల్ కలెక్టర్లు అందరూ ప్రతి రోజు ఏజెన్సీలతో సమీక్ష చేసి, ట్యాబ్‌లో నమోదును వేగవంతం చేయాలన్నారు. ఏమై నా సమస్య ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. రైతులకు ఎంఎస్‌పీ పే మెంట్ విషయంలో నిధుల కొరత లేదన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
పొగ మంచులో డ్రైవర్లు
జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: చలి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాత్రివేళ పొగమంచు ఏర్పడడం వల్ల వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. మంచు వల్ల రోడ్లపై దృష్టి తగ్గడం, ముందు ఉండే వాహనాల దూరం అంచనా వేయడం ఇబ్బందికరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రమాదాలు నివారించడానికి డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రి వేళ వాహనాలు ఓవర్ టేక్ చేయడం, స్పీడ్‌గా వెళ్లడం వంటివి చేయరాదని సూచించారు.
ఉపాధ్యాయులకు నోటీసులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నిర్వహించిన శిక్షణకు హాజరుకాని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు తగిన కారణంతో వెంటనే సమాధానం ఇవ్వాలని, సరైనా కారణం లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఘనంగా మహబూబ్‌నగర్ అవతరణ వేడుకలు


