నాడుమామ, అత్త– నేడు కోడలు
నవాబుపేట: సర్పంచ్ ఎన్నికల బరిలో ఒకే కుటుంబం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచారు. గతంలో తాజాగా పోటీలో ఉన్న మహిళ మామ అంతయ్య 1995లో మండలంలోని అమ్మాపూర్ సర్పంచ్‌గా గెలుపొందాడు. అనంతరం 2001లో మహిళా రిజర్వేషన్ రావడంతో ఆయన భార్య అరుణమ్మ సర్పంచ్‌గా బరిలో నిలిచి విజయం సాధించింది. తాజాగా అంతయ్య కోడలు రావలీల సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచింది.
పంచాయతీ బరిలో మాజీలు
పంచాయతీ ఎన్నికలలో మాజీ సర్పంచ్‌లు బరిలో నిలిచారు. తాజాగా జరుగుతున్న ఎన్నికలలో పోమాల్ నుంచి తాజామాజీ సర్పంచ్‌గా ఉన్న కృష్ణ తన భార్య లక్ష్మిని బరిలో నిలిపాడు. కారుకొండలో మాజీ సర్పంచ్ ప్రతిపక్ష పార్టీకి చెందిన పురుషోత్తం తాజాగా మరోసారి సర్పంచ్‌గా రంగంలో దిగాడు. తీగలపల్లి మాజీ సర్పంచ్ నారాయణ తన భార్య మాజీ ఎంపీటీసీ లక్ష్మమ్మను సర్పంచ్‌గా బరిలో దించాడు. దేపల్లిలో మాజీ సర్పంచ్ దశరత్ తాజాగా మహిళా రిజర్వేషన్ రావడంతో తన భార్యను సర్పంచ్ బరిలో నిలిపాడు.


