చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

Dec 4 2025 8:55 AM | Updated on Dec 4 2025 8:55 AM

చేపల వేటకు  వెళ్లి వ్యక్తి గల్లంతు

చేపల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

నవాబుపేట: మండల కేంద్రంలోని పోచమ్మ కుంటలో వ్యక్తి చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈ ఘటన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన రావుల చంద్రయ్య(54) బుధవారం చేపల వేటకు గ్రామ సమీపంలోని పోచమ్మ కుంటకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఆరాతీశారు. పోచమ్మకుంట కట్టపైన చంద్రయ్య చెప్పులు, ఫోన్‌ లభిచడంతో ఆయన ప్రమాద వశాత్తు కుంటలో పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమచారం అందించగా ఘజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలిస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్‌ తెలిపారు.

వరిధాన్యం కుప్పను ఢీకొన్న బైక్‌..

యువకుడి దుర్మరణం

అమరచింత: బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ యువకుడు రోడ్డుపై ఉన్న వరి ధాన్యం కుప్పను ఢీకొని మృతిచెందిన ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. నాగల్‌కడ్మూర్‌కు చెందిన రాజు (35) బుధవారం మధ్యాహ్నం మండల కేంద్రానికి బయలుదేరాడు. గ్రామ సమీపంలోని కోళ్ల ఫారం వద్ద ఉన్న రహదారి మలుపులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై ఆరబోసిన వరిధాన్యం కుప్పను ఢీకొని కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 వాహనంలో ఆత్మకూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. నాగిరెడ్డిపల్లే నుంచి నాగల్‌కడ్మూర్‌ మీదుగా అమరచింత వరకు ఉన్న ప్రధాన బీటీ రహదారిపై రోడ్డుకు సగభాగం వరిధాన్యం కుప్పలు ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.

వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

బల్మూర్‌: పంచాయతీ కార్యాలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన బల్మూర్‌ మండలంలోని గట్టుతుమ్మెన్‌లో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గట్టుతుమ్మెన్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం క్లస్టర్‌ పరిధిలోని మహదేవ్‌పూర్‌, మంగళకుంటపల్లి, గట్టుతుమ్మెన్‌ గ్రామాలకు చెందిన సర్పంచ్‌, వార్డు సభ్యుల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన కార్వంగ శ్రీను (43) నామినేషన్‌ కేంద్రం వెనకాల ఉండగా.. బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. రక్తపు మడుగులో ఉన్న వ్యక్తిని పరిశీలించగా.. అతడు అప్పటికే మృతి చెందాడని గుర్తించి స్థానికులు బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ రాజేందర్‌ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. గట్టుతుమ్మెన్‌ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా.. వెనక భాగంలో మహాదేవ్‌పూర్‌ నుంచి వచ్చిన కార్లు పార్క్‌ చేశారు. వారే రివర్స్‌ తీసే క్రమంలో ఢీకొట్టడంతోనే శ్రీను మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement