పీయూలో డిజిటల్ సేవల మెరుగుకు ఒప్పందం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో డిజిటల్ సేవలను మరింత మెరుగు పర్చేందుకు అధికారులు సైబర్ హైట్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు అడ్మిన్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులతో పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్‌బాబు ఒప్పందం కుదుర్చుకున్నారు. డిజిటల్ సేవల్లో భాగంగా విద్యార్థులు సులువుగా వేగవంతంగా యూనివర్సిటీకి సంబంధించిన పలు విభాగాల్లో సేవలు విస్తరించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు అఽధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమయ్యే కాన్వకేషన్, మైగ్రేషన్, కన్సాల్‌డేటెడ్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫీకెట్‌లతోపాటు ఎగ్జామినేషన్స్‌కు సంబంధించిన వాటిని నేరుగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకుని, ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేట్‌లు పొందేందుకు అవకాశం ఉందన్నారు. దీనిద్వారా విద్యార్థులకు నిర్తీత గడువులోగా కచ్చితత్వంతో సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో ప్రధానంగా రియల్‌టైం ట్రాకింగ్, డోర్‌స్టెప్ డెలివరీ, క్యూర్ కోడ్‌తో పేమెంట్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సదానందం హాజరయ్యారు.
హాస్టల్‌లో రోటీ మేకర్స్ ప్రారంభం
హాస్టల్స్ విద్యార్థులకు సకాలంలో చపాతి అందించేందుకు రోటీమేకర్స్ ఇవ్వాలని పీయూ అధికారులు ఎస్‌బీఐ గణేశ్‌నగర్ బ్రాంచ్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా స్పందించిన బ్యాంకు అధికారులు కార్పోరేట్ రెస్పాన్స్‌బిలిటీ కింద పీయూకు రూ.10.17లక్షల విలువైన రోటీమేకర్స్ అందజేశారు. ఈమేరకు బాలికల హాస్టల్‌లో వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్‌బాబు బుధవారం రోటీ మేకర్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.
పుంజుకున్న ఉల్లి ధరలు
దేవరకద్ర: పట్టణంలోని మార్కెట్ యార్డులో బుధవారం ఉదయం జరిగిన బహిరంగ వేలంలో ఉల్లి ధరలు పుంజుకున్నాయి. మూడు వా రాలుగా మార్కెట్‌కు వచ్చిన కొత్త ఉల్లికి ధర రూ.వెయ్యి కూడా రాలేకపోయేది. కాగా.. ఈ వారం ధరలు రెండింతలకు పెరగడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేశారు. మార్కెట్‌కు దాదాపు 500 బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో వ్యాపారులు వేలం వేశారు. క్వింటాల్ ఉల్లి ధర గరిష్టంగా రూ.1,600, కనిష్టంగా రూ. వెయ్యి వరకు ధరలు లభించాయి. వేలం తర్వా త 50కిలోల ఉల్లి బస్తా గరిష్టంగా రూ.800, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు.
పీయూలో డిజిటల్ సేవల మెరుగుకు ఒప్పందం
పీయూలో డిజిటల్ సేవల మెరుగుకు ఒప్పందం


