చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చారకొండ: మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన అక్కి శ్రీనివాసులు గౌడ్(40) చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 28న హైదరాబాద్ నుంచి కల్వకుర్తికి కారులో ప్రయాణిస్తుండగా వెల్దండ సమీపాన హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య సుజాత ముగ్గురు పిల్లలు ఉన్నారు.
శ్రీనివాస్ గౌడ్ (ఫైల్)


