 
															న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
చిన్నచింతకంట: చట్టాలు, హక్కులు, ఉచిత న్యాయ సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. కురుమూర్తి జాతరలో గురువారం జిల్లా న్యాయ సేవల ప్రదర్శన స్టాల్‌ను న్యాయమూర్తి ప్రారంభించారు. లీగల్ సర్వీసెస్ యాక్ట్ 1987 ప్రకారం అమలవుతున్న పథకాలను వివరించారు. ఈ స్టాల్ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయ అర్హత వివరాలు, లోక్ అదాలత్ సమాచారం, న్యాయ చట్టాల పుస్తకాలను అందజేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు ఓబుల్‌రెడ్డి, శివశంకర్ పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
