 
															గూడ్స్ రైలు ఢీకొట్టి 18 గొర్రెలు మృత్యువాత
మక్తల్: గూడ్స్ రైలు ఢీకొట్టడంతో గొర్రెలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని దాసర్‌దొడ్డి శివారుల్లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గుర్లపల్లికి చెందిన మొగులప్ప, వెంటకప్ప కు చెందిన గొర్రెలు మేత మేస్తూ రైలు పట్టాల సమీపంలోకి వెళ్లాయి. అదే సమయంలో గూడ్స్ రైలు రావడంతో పట్టాలపై ఉన్న గొర్రెలను ఢీకొట్టగా.. 18 అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. మరికొన్నింటిని కాపరులు రక్షించారు. దీంతో కాపారులు మాట్లాడుతూ గొర్రెలు మృతి చెందడంతో ఆర్థికంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవానలి వేడుకున్నారు.
 
							గూడ్స్ రైలు ఢీకొట్టి 18 గొర్రెలు మృత్యువాత

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
