 
															లారీ వెనక టైర్ కింద పడి వ్యక్తి దుర్మరణం
ధరూరు: లారీ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని అల్వాలపాడు శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కేటీదొడ్డి మండలంలోని మైలగడ్డ గ్రామానికి చెందిన చింతలన్న (40) తన ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి 9 గంటల సమయంలో అల్వాలపాడు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. అదే సమయంలో కర్ణాటక పాసింగ్‌తో ఉన్న ఓ లారీ రాయిచూరు వైపు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు లారీ వెనక టైర్ కిందపడి చింతలన్న అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రేవులపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని గద్వాల ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
