 
															వివాహిత ఆత్మహత్య
ఆత్మకూర్: అనారోగ్యంతో బాధపడుతున్న వివాహిత చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం ఆత్మకూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ పట్టణంలోని సంజీవ్‌నగర్ కాలనీలో ఉంటున్న చిట్టెమ్మ(45) గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది, బుధవారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో నుంచి వెళ్లిపోయి స్థానిక పరమేశ్వరస్వామి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం కుటుంబసభ్యులు గాలింపు చేపట్టగా చెరువులో మృతదేహం గుర్తించారు. మృతురాలికి కూతురు, కుమారుడు, భర్త ఉన్నారు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
 
							వివాహిత ఆత్మహత్య

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
