 
															ఐదుగురి డిప్యుటేషన్లు నిలిపివేత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: సాక్షిలో ప్రచురితమైన గురువారం ప్రచురితమైన ‘అడ్డగోలు డిప్యుటేషన్లు’ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. జిల్లాలో ఐదుగురు ఉపాధ్యాయుల డిప్యుటేషన్‌లకు సంబంధించి ఆర్డర్స్ ఇవ్వగా.. వారు గురువారం విధుల్లో చేరాల్సి ఉంది. వీరి డిప్యుటేషన్లు నిబంధనల ప్రకారం లేదని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన డీఈఓ ప్రవీణ్‌కుమార్ ఆ ఐదుగురి డిప్యుటేషన్లను నిలిపివేసి.. ప్రస్తుతం ఉన్న పాఠశాలల్లోనే కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంఈఓలను ఆదేశించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
