శాస్త్రోక్తంగా కురుమూర్తిస్వామి చక్రస్నానం
కురుమూర్తిస్వామికి ఆలయ పుష్కరిణిలో బుధవారం తెల్లవారుజామున శాస్త్రోక్తంగా పూజారులు చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి నిర్వహించే సేవా కార్యక్రమాలు మంగళవారంతో ముగిశా యి. ఈక్రమంలో చివరిరోజైన మంగళవారం అర్ధరాత్రి స్వామివారికి గరుడ వాహనసేవ నిర్వ హించారు. ఈ సేవ అర్ధరాత్రి ప్రధాన ఆలయం నుంచి ప్రారంభమై పుష్కరిణి వరకు కొనసాగింది. బుధవారం తెల్లవారుజామున అనంతరం స్వామి అమ్మవార్లకు మంత్రోచ్ఛరణల నడుమ పూజారులు చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం కొనసాగింది. పలువురు విద్యార్థినులు కూచిపూడి నృత్యం.. వేంకటేశ్వరస్వామి వేషధారణలో భక్తులను ఆకట్టుకున్నారు. ఆలయ సిబ్బంది ఉదయమే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు దాసంగాలు సమర్పించి.. చల్లంగా చూడాలని వేడుకున్నారు. కొండపైన అలువేలు మంగమ్మ, ఆంజనేయస్వా మి, ఉద్దాల మండపం, చెన్నకేశవ స్వామి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, కమలాకర్, భాస్కరాచారి పాల్గొన్నారు.


