జోగుళాంబ రైల్వేహాల్ట్ త్వరలో పునఃప్రారంభం
● దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్‌ఎం రామారావు
ఉండవెల్లి: మండలంలోని జోగుళాంబ రైల్వేహాల్ట్‌ను నవంబర్ మొదటి, రెండో వారంలో పునఃప్రారంభిస్తామని దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్‌ఎం రామారావు తెలిపారు. జోగుళాంబ రైల్వేహాల్ట్‌లో ప్రయాణికులకు ఆకర్షనీయంగా ఏర్పాటు చేసిన ద్వారా న్ని, పెయింటింగ్ చిత్రాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లైటింగ్, టయిల్స్, బుకింగ్, విశ్రాంతి గదులు, హైలెవవల్ ఫ్లాట్‌ఫాం, విద్యుదీకరణ పనులపై ఆరా తీశారు. ప్రయాణికులు కూర్చోవడానికి టేబుళ్లు, నీడకోసం షెల్టర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రైల్వేస్టేషన్‌లో కొన్ని రైళ్లను కూడా నిలిపేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


