బీసీలకురాజ్యాధికారం దక్కాలి
మక్తల్: రాష్ట్రంలో అగ్రకులాలు బీసీలను మోసం చేస్తున్నారని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాండుయాదవ్ అన్నారు. శనివారం పట్టణంలో జిల్లా బీసీ ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కోర్టులో పిటిషన్ వేసి కొందరు అడ్డుపడుతున్నారన్నారు. బీసీలకు రాజ్యాధికారం దక్కాలంటే ఇప్పటికై నా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కొన్ని పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయానికి వాడుకుంటున్నాయని మండిపడ్డారు. అనంతరం మాగనూర్ మండంల కర్కూర్ గ్రామానికి చెందిన పసుల అంజనేయులుకు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించి, నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లోకపల్లి భీమేష్, జిల్లా నాయకులు నర్సింహ, శాలివాహన దండు, దేవప్ప, కుర్మయ్య, తోటి అశోక్, ఆశప్ప, వెంకటప్ప, పరశురాం, బుగ్గప్ప, వెంకటప్ప, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.


