హ్యామ్ నిధులతో రోడ్ల అభివృద్ధి
జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్(హ్యామ్) పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ద్వారా రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం తొలి విడుతలో సర్కిల్‌కు రూ.421 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 20రోడ్లను అభివృద్ధి పరుస్తామని, నవాబుపేట మండలంలో లింగంపల్లి మీదుగా బాలానగర్, రుద్రారం నుంచి కూచూరు మీదుగా మల్‌రెడ్డిపల్లికి, నవాబ్‌పేట నుంచి పోమాల్ మీదుగా కేశవరావుపల్లి రోడ్లకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. అదేవిధగా బాలానగర్ నుంచి నేలబండ తండా, హేమాజీపూర్, బిల్డింగ్‌తండా వరకు, జెడ్పీరోడ్డు నుంచి బోడజానంపేట, ఆగ్రహారంపొట్లపల్లివరకు, బాలానగర్ నుంచి నందారం, మోతిఘన్‌పూర్ వరకు, బూర్గుల నుంచి లింగారం రోడ్డు, రాజాపూర్ మండలంలో మర్రిబాయితండా రోడ్డు, ఈద్గానిపల్లి, నాన్‌చెరువుతండా మీదుగా తిరుమలగిరి, జాతీయ రహదారి నుంచి ముదిరెడ్డిపల్లి మీదుగా నందారం వరకు, కుచ్చర్‌కల్ నుంచి ఖానాపూర్ వరకు, జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి క్రాస్‌రోడ్డు నుంచి ఈర్లపల్లి వరకు, అల్వాన్‌పల్లి నుంచి తంగెళ్లపల్లి మీదుగా నసరుల్లాబాద్ వరకు, బూర్గుపల్లి మీదుగా పెద్దతండా వరకు, మంగలికుంట తండా రోడ్డు, మిడ్జిల్ మండలంలోని రానిపేట నుంచి దోనూర్, సింగందొడ్డి మీదుగా తొమ్మిదిరేకుల వరకు, వాడ్యాల నుంచి వేముల మీదుగా వెల్జాల వరకు, వేముల నుంచి మసిగుండ్లపల్లి మీదుగా చెన్నంపల్లి వరకు, ఊర్కొండ మండలంలో ముచ్చర్లపల్లి నుంచి రాంరెడ్డిపల్లి, బొమ్మరాసిపల్లి, జగబోయిన్‌పల్లి మీదుగా వెల్జాల రోడ్డు వరకు, మాదారం నుంచి గుడిగానిపల్లి మీదుగా మల్లాపూర్ క్రాస్‌రోడ్డు వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
పిడుగుపాటుకు 14 గొర్రెలు మృత్యువాత
అలంపూర్: పట్టణంలోని సంతోష్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌కు చెందిన 14 గొర్రెలు పిడుగుపడి మృతిచెందాయి. వెంకటేశ్ గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున వర్షంతోపాటు పిడుగులు పడడంతో వాటి ధాటికి 14 గొర్రెలు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన గొర్రెల విలువు దాదాపు రూ.2 లక్షల వరకు ఉంటందని బాధితుడు తెలిపారు. పశు సంవర్థక శాఖ అధికారులు మృతిచెందిన గొర్రెలను పరిశీలించిట్లు తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని కోరారు.


