ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు పీయూ జట్టు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పంజాబ్‌లోని గురుకాసి యూనివర్సిటీ ఈనెల 24న నిర్వహించే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టౌర్నీలో పాల్గొనేందుకు ఆర్చరీ పురుషుల జట్టు మంగళవారం ప్రయాణమైంది. ఈ మేరకు జట్టు సభ్యులను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందిచి, క్రీడా దుస్తులు అందజేశారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో తమ ప్రతిభను చూపి పీయూకు గోల్డ్‌మెడల్ సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, అధ్యాపకులు కిషోర్, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


