బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం
● నేటినుంచి కురుమూర్తిస్వామి
జాతర ప్రారంభం
● 26న అలంకారోత్సవం,
28న ఉద్దాల ఉత్సవం
● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార యంత్రాంగం
చిన్నిచింతకుంట: తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవమై న అమ్మపూరం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవా లు ఈనెల 22వ తేదీ నుంచి అంగరంగా వైభవంగా కొనసాగనున్నాయి. అమావాస్య పాడ్యమిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏడు రోజులపాటు అంగరంగ వైభవంగా కొనసాగుతా యి. వీటితోపాటు జాతర ఉత్సవాలు నెలరోజుల పాటు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర రా ష్టాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. దాదాపు పదిలక్షల మంది భక్తులు హాజరుకానున్నట్లు ఆలయ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో నెలరోజులపాటు కాంఛన గుహ గోవింద నామస్మరణలతో మారు మోగుతుంది.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
స్వామివారి బ్రహ్మోత్సవాలకు అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాగణమంతా రంగులు అద్దారు. అర్చకులు స్వామివారు విహరించే వాహనసేవా కార్యక్రమాల వస్తువులను శుద్ధి చేసి సిద్ధం చేశారు. స్వామివారి ప్రధాన ఆలయం, అమ్మవారి ఆలయం, రాజగోపురం తదితర వాటిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. అక్కడక్కడా హైమాస్ట్ లైట్లతోపాటు వీధిదీపాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జాతర మైదానంలో ఉన్న తాగునీటి ట్యాంకులు శుభ్రపరిచారు. కొళాయిలు ఏర్పాటు చేసి తాగునీటిని అందించనున్నారు. జాతర ప్రాగణంలో పారిశుద్ధ్యం లోపించకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలకు ఇబ్బందులు కలుగకుండా మరుగుదొడ్డు నిర్మించి అక్కడక్కడా తాత్కాలిక మూత్రశాలు ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఆలయ ముఖద్వారం నుంచి ఉద్దాల గుండువరకు భారీకేడ్లు ఏర్పాటు చేసి జాతర ప్రాగణంలో సీసీ కెమరాలు అమర్చనున్నారు.
26న అలంకారోత్సవం
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన మైన ఘట్టం అలంకారోత్సవం. ముక్కెర వంశపురాజులు బహూకరించిన ఆభరణాలను నెలరోజులపాటు స్వామివారికి అలకంచడం ఈ ఉత్సవ ప్రత్యేకత వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లోని ఎస్‌బీఐ లాకర్‌లో భద్రపరిచిన స్వామివారి బంగారు ఆభరణాలను పోలీస్ బందోబస్తు మధ్య కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా అమ్మాపురం సంస్థానదీసులు రాజశ్రీరాంభూపాల్ ఇంటికి చేరుస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అంబోరు మధ్యన కాలినడకతో కురుమూర్తి గిరులకు తరలిస్తారు. కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
28న ఉద్దాల ఉత్సవం
స్వామివారి ఉత్సవాల్లో ఉద్దాల ఉత్సవం ప్రత్యేక ఘట్టం. చిన్న వడ్డేమాన్‌లో దళితులు వారం రోజులపాటు భక్తిశ్రద్ధలతో తయారు చేసిన పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అప్పంపల్లి, తిర్మలాపూర్ మీదుగా ఊరేగింపుగా కురుమూర్తి గిరులకు తరలిస్తారు. ఈ ఊరేగింపులో శివసత్తుల ఆటపాటలు, గోవింద నామస్మరణ మార్మోగుతాయి. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.
● 22న బుధవారం ధ్వజారోహణం,
దేవత ఆహ్వానం, భేరీపూజ, అష్టోత్తర
శత కలశాభిషేకం, స్వామివారి కల్యాణో త్సవం, మహానివేదన, మంగళ నిరాజనం సాయంత్రం 6:15గంటలకు భూసమేత స్వామివారి మయూర వాహనసేవ నిర్వహించనున్నారు.
● 23న గురువారం ఉదయం హోమ
కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సాయంత్రం 6:20 గంటలకు
హంసవాహన సేవ.
● 24న శుక్రవారం సాయంత్రం 6:25
గంటలకు శేషవాహన సేవ.
● 25న శనివారం సాయత్రం 6:30
గంటలకు గజ వాహన సేవ.
● 26 ఆదివారం మధ్యాహ్నం స్వర్ణాభరణా
లతో ఊరేగింపు అలంకారోత్సవం, రాత్రి 9:45 గంటలకు అశ్వవాహన సేవ.
● 27న సోమవారం రాత్రి 10 గంటలకు
హనుమద్వాహన సేవ.
● 28న మంగళవారం ఉద్దాల ఉత్సవం,
రాత్రి 10:15గంటలకు గరుడవాహన సేవ
● 29న బుధవారం పుష్పయాగం,
ప్రత్యేక పూజలు.
● 30న గురువారం ప్రత్యేక పూజలు
● 7న శుక్రవారం ఉదయం 9:45గంటలకు
అలంకరణ ఆభరణాలు తీస్తారు.
అనంతరం జాతర ఉత్సవాలు
కొనసాగుతాయి.
కోనేరు
విద్యుద్దీపాలతో ప్రవేశ ద్వారం
రోజువారీ కార్యక్రమాలు
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం


