తిప్పేసిన ముఖితుద్దీన్
● నిజాం కళాశాలపై సంచలన బౌలింగ్
● ఏడు పరుగులకే 8 వికెట్లు తీసిన స్పిన్నర్
● మహబూబ్‌నగర్ ఘన విజయం
మహబూబ్‌నగర్ క్రీడలు: హెచ్‌సీఏ రెండు రోజుల లీగ్‌లో సంచలన బౌలింగ్‌తో సత్తా చాటాడు. నిజాం కళాశాల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎండీ ముఖితుద్దీన్ 9.5 ఓవర్లలో కేవలం 7 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసి రెండు రోజుల లీగ్‌లో జిల్లా తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శించాడు. ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ను డకౌట్‌గా ఔట్ చేశారు. హైదరాబాద్‌లోని గ్రీన్‌వ్యూ–3 మైదానంలో మంగళవారం నిజాం కళాశాల జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నిజాం కళాశాల జట్టు జిల్లా బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. ముఖితుద్దీన స్పిన్ జోరుకు 31.5 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన జిల్లా జట్టు 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అబ్దుల్ రాఫె 23 నాటౌట్, కొండ శ్రీకాంత్ 23 పరుగులు చేశారు. 8 వికెట్లు తీసిన ముఖితుద్దీన్‌తో పాటు జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తిప్పేసిన ముఖితుద్దీన్


