దక్షిణకాశీలో అమావాస్య పూజలు
● ‘జోగుళాంబ’ఆలయంలో చండీ హోమాలు
● స్వామివారికి అభిషేక పూజలు
అలంపూర్: దక్షిణ కాశీగా వెలుగొందుతున్న అలంపూర్ క్షేత్రంలో మంగళవారం అమావాస్య పూ జలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. శ్రీజోగుళాంబ అమ్మ వారి ఆలయంలో చండీ హోమాలు ని ర్వహించారు. ప్రతి అమావాస్య, పౌర్ణమితో పాటు శుక్రవారం అమ్మవారి ఆలయంలో సాముహిక చండీ హోమాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకాలు, అర్చన పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో భక్తులు కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు భక్తులతో సందడిగా మారాయి. క్షేత్రానికి వచ్చిన భక్తులకు ప్రసాద్ స్కీం భవనంలోని నిత్య అన్నదాన సత్రంలో అన్నప్రసాదం అందించారు.
దక్షిణకాశీలో అమావాస్య పూజలు


